Pages

Thursday, December 29, 2016

Spoken English in Telugu. English words & Telugu Meanings

Spoken English in Telugu

English words & Telugu Meanings

spoken english in Telugu
1)Be - బి - ఉండు

2)Is -   ఈజ్  -  అయిఉండు

3) Am -  యామ్ -  అయి ఉన్నాను

4) Are  –  ఆర్  -  అయి ఉన్నారు

5)Was  -  వజ్  -  అయి ఉండెను

6)Were  – వర్  -  అయు ఉండే వారు

7) I  - ఐ  -  నేను

8)We  -  ఉయ్  -  మేము , మనము

9)You  -  యు  -  మీరు , నీవు

10) He  -  హి  -  అతడు

11) She  -  షి  -  ఆమె

12)They  -  దే  -  వారు

13) What  -  వాట్  -  ఏమిటి

14) Why  -  వై  -  ఎందుకు 

15) When  -  వెన్  -  ఎప్పుడు

16) How  -  హౌ  -  ఎలా

17) Where  -  వేర్  -  ఎక్కడ

18)Before  -  బిఫోర్  - ముందు

19)After  -  ఆఫ్టర్  -  తరువాత

20)With  - విత్  -  తో

21) On  -  ఆన్  -  మీద

22) In  -   ఇన్  -  లోపల

23) Up  -  అప్  -  మీద

24)Down  -  డౌన్  -  క్రింద

25)Beyond  -  బియాండ్  -  అవతల

26)By  -  బై  -  చేత , వలన

27) Of  -  ఆఫ్  -  యొక్క

28)Below  -  బిలో  - క్రింద

29)Front  -  ఫ్రంట్  -  ముందు

30) Back  -  బేక్  -  వెనుక

31)For  -  ఫర్  -  కొరకు

32)About  - ఎబౌట్  -  గురించి

33)Between  -  బిట్వీన్  - మధ్యలో

34)Beside  -  బిసైడ్  - ప్రక్కన

35)Around  -  ఎరౌండ్  -  చుట్టు ప్రక్కల

36)Among - ఎమాంగ్ -u మధ్య 

37)Teacher  -  టీచర్  -  ఉపాధ్యాయుడు

38)Friend  -  ఫ్రెండ్  -  స్నేహితుడు

39)Time  -  టైమ్  -  సమయం

40)There  -  దేర్  -  అది

41)Here -  హియర్ - ఇక్కడ

42) Strong  -  స్ట్రాంగ్  -  బలమైన , దృఢమైన

43)School  -  స్కూల్  - పాఠశాల

44)Half   - హాఫ్  -  సగం

45)Full  -  ఫుల్  -  పూర్తిగా

46)First  -  ఫష్ట్  -  మొదటి

47)Second  -  సెకండ్  -  రెండవ –

48)Third  -  థర్డ్  -  మూడవ

49)Children  -  చిల్డ్రన్  -  పిల్లలు

50)People  -  పీపుల్  - ప్రజలు

51)Good  -  గుడ్  - మంచిదైన

52)Bad  - బేడ్  -  చెడ్డదైన

53)Sea  -  సీ  - సముద్రం

54)River  -  రివర్  -  నది
y
55)Pond  -  పాండ్  – చెరువు

56)Near  -  నియర్  -  దగ్గర

57)Far  -  ఫార్  -  దూరంగా

58)Morning  -  మోర్నింగ్  -  ఉదయం

59)Afternoon  -  ఆఫ్టర్ నూన్  - మధ్యాహ్నం

60)Evening  - ఈవినింగ్  -  సాయంత్రం

61) Night   -  నైట్  - రాత్రి

62)Mid-night   - మిడ్ నైట్   -  అర్థరాత్రి

63) Eye  -  ఐ   -  కన్ను

64)Head   -  హెడ్  -  తల

65)Nose   -  నోస్  -  ముక్కు

66)Mouth  -  మౌత్  -  నోరు

67)Tooth  -  టూత్  -  పన్ను

68)Tongue  -  టంగ్  -  నాలుక

69)Hand  -  హేండ్  -  చెయ్యి

70)Finger  -  ఫింగర్  -  వ్రేని

71)Leg  -  లెగ్  -  కాలు

72)Ear  -  ఇయర్  -  చెవి

73)Nail  -  నెయిల్  -  గోరు

74)Little  -  లిటిల్  -  కొద్ది , కొంత

75)Big  -  బిగ్   -  పెద్ద

76)More  -  మోర్  -  ఎక్కువ

77)Less  -  లెస్  -  తక్కువ

78)Pain  -  పెయిన్  -  నొప్పి

79)Fun  -  ఫన్  -  వినోదం , తమాషా

80)Loud  -  లౌడ్  -  బిగ్గరగా

81)Calm  -  కామ్  -  నెమ్మదైన

82)Rock  -  రాక్  -  రాయి

83)But  –  బట్  -  కాని

84) Lesson  - లెసన్  -  పాఠము

85) Yes  -  యస్  -  అవును

86)No  -  నో  -  కాదు , లేదు

87)Breakfast  -  బ్రేక్ ఫాస్ట్  - ఉదయపు భోజనం

88)Lunch  -  లంచ్  -  మధ్యాహ్నపు భోజనం

89)Dinner  –   డిన్నర్  -  రాత్రి భోజనం

90)Fruit  -  ఫ్రూట్  -  పండు

91)Bread  -  బ్రెడ్  -   రొట్టె

92)One  -  వన్  -  ఒకటి

93)Two  -  టు  -  రెండు

94)Three  -  త్రీ  –  మూడు

95)Four  -  ఫోర్  -  నాలుగు

96)Five  -  ఫైవ్  -  ఐదు

97)Six  -  సిక్స్  -  ఆరు

98)Seven  - సెవన్  - ఏడు

99)Eight  -  ఎయ్ ట్  - ఎనిమిది

100)Nine   -  నైన్  -  తొమ్మిది

101)Ten  -  టెన్  -  పది

102)Eleven  - ఎలెవన్  -  పదకొండు

103)Twelve  -  ట్వల్వ్  - పన్నెండు

104)Thirteen   -  థర్టీన్  -  పదమూడు

105)Fourteen   -  ఫోర్టీన్  -  పద్నాలుగు

106)Fifteen   -  ఫిఫ్టీన్  –  పదిహేను

107)Sixteen   -  సిక్స్ టీన్   -  పదహారు
u
108)Seventeen   -  సెవంటీన్   –  పదిహేడు

109)Eighteen   -   ఎయిటీన్  -  పద్దెనిమిది

110)Nineteen   -  నైంటీన్   – పంతొనిమిది

111)Twenty   -   ట్వంటీ   –  ఇరవై

112)Hot  -   హాట్   -  వేడైన
U
113)Cool  -  కూల్  - చల్లని

114)Health  -  హెల్త్  -  ఆరోగ్యం

115)Name  -  నేమ్  -  పేరు

116)Color   -  కలర్   - రంగు

117)Ball   -  బాల్  -  బంతి

118)Stomach   -  స్టమక్   -   కడుపు

119)Green   -  గ్రీన్  -  పచ్చని

120)Blue   -   బ్లూ   -   నీలం

121)Pink   -   పింక్   -   గులాబీ

122)Black   -   బ్లాక్   - నలుపు

123)White   -  వైట్   -  తెలుపు

124)Stone   -   స్టోన్   -   రాయి

125)Now   -  నౌ   -  ఇప్పుడు

126)Then   -   దెన్   -  అప్పుడు

127)Because   -  బికాజ్   -  ఎందుకంటే

128)A  - ఎ  -  ఒక

129)An   -  యాన్   -  ఒక

130)The   - ది   -   ఆ  , ఈ

131)Animal   -   యానిమల్   -   జంతువు

132)Place   -  ప్లేస్  -  చోటు

133)Hard  -  హార్డ్  -  కఠినమైన , గట్టిదైన

134)Easy   -   ఈజీ   -  సులభమైన

135)These  -  దీజ్  -  ఇవి

136)Those   -  దోజ్  -  అవి

137)Story  -  స్టోరీ  -  కథ

138)Slow   -  స్లో   -  నెమ్మదైన

139)Fast   -  ఫాస్ట్   -   వేగంగా

140)Long   -   లాంగ్   -   పొడు గాటి

141)Short   -   షార్ట్   -  పొట్టి

142)Water  -  వాటర్  -  నీరు

143)Boat  -  బోట్  -  పడవ

144)House  -  హౌస్  -  ఇల్లు

145)Tree  - ట్రీ  -  ఇల్లు

146)Gold  -  గోల్డ్  -  బంగారం

147)Always  -  ఆల్వేజ్ - ఎల్లప్పుడూ

148)God   -  గాడ్  -  దేవుడు

149)Person  -  పెర్సన్  -  వ్యక్తి

150)Friend   - ఫ్రెండ్   -  స్నేహితుడు

151)Enemy -ఎనిమి - శత్రువు

152)Life   -  లైఫ్   -  జీవితం

153)Minute   -  మినిట్   -   నిమిషం

154)Happy   -  హేపీ  -  సంతోషం

155) Sad   -  సేడ్  -  విచారకరమైన

156)Summer   -  సమ్మర్  -  వేసవి

157)Winter   –   వింటర్   -   శీతా కాలం

158)Another   -   ఎనదర్   -   మరియొక

159)Shop   -   షాప్   -   దుకాణం

160)Mother   -   మదర్   -   తల్లి

161)Father   -   ఫాదర్   -   తండ్రి

162)Sister   -   సిస్టర్  -  సోదరి

163)Brother   -   బ్రదర్   –   సోదరుడు

164)Son  -   సన్  -  కొడుకు

165)Daughter   -  డాటర్   - కూతురు

166)Town   -   టౌన్   -   పట్టణం

167)Village   -  విలేజ్   -  గ్రామము

168)India   -   ఇండియా   -  భారతదేశం

169)Once   -  వన్స్   -   ఒకసారి , ఒకప్పుడు

170)Twice   -  ట్వైస్   -   రెండు సార్లు

171)Thrice   -   త్రైస్   -   మూడు సార్లు

172)Chair   -   ఛైర్   -   కుర్చీ

173)Table   -   టేబుల్   -  టేబులు

174)Old   -   ఓల్డ్   -  పాతదైన, ముసలియైన

175)Young   -   యంగ్   -   కుర్రనైన

176)New   -   న్యూ   -   కొత్త

177) King   -   కింగ్   -   రాజు

178)Master   -   మాస్టర్   -   గురువు

179)Angry   -  ఏంగ్రీ   -   కోపంగా

180)Parrot   -   పేరట్   -   చిలుక

181)            Nest   -   నెస్ట్   -   పక్షి గూడు

182)            Morning   -   మోర్నింగ్   -   ఉదయం

183)            Afternoon   -   ఆఫ్టర్ నూన్  - మద్యాహ్నం

184)            Evening   -   ఈవినింగ్   -  సాయంత్రం

185)            Night   -   నైట్   –   రాత్రి

186)            Mid-night   - మిడ్ నైట్   -  అర్థరాత్రి

187)            Tail   -  టెయిల్  -  తోక

188)            Lion   -  లయన్   -  సింహం

189)            Tiger   -   టైగర్   -   పులి

190)            Fox   -  ఫాక్స్  -  నక్క

191)            Please   -   ప్లీజ్   - దయచేసి

192)            Question   -   క్వశ్చన్   -   ప్రశ్న

193)            Answer   -    ఆన్సర్   – జవాబు

194)            This   -  దిస్  -  ఇది

195)            That    -   దట్   -  అది

196)            Road   -   రోడ్    - రోడ్డు , బాట

197)            Sky   -   స్కై  -  ఆకాశం 

198)            Earth  -  ఎర్త్   -  భూమి

199)            Money   -  మనీ  -   డబ్బు , సొమ్ము

200)            Elephant   -  ఎలిఫేంట్   -   ఏనుగు

201)            Job   -   జాబ్  -  ఉద్యోగం

202)            Oil   -   ఆయిల్   -  నూనె

203)            Rope   -   రోప్   -   లావైన త్రాడు

204)            Neck   -   నెక్   -   మెడ

205)            Horse   -   హార్స్   -   గుర్రం

206)            True   -   ట్రూ   -  నిజమైన

207)            False   -  ఫాల్స్   -  అబద్ధమైన

208)            Vessel   -   వెస్సెల్   -  పాత్ర

209)            Month   -   మంత్   -  నెల

210)            Ear   -   ఇయర్   -  చెవి

211)            Man   -  మేన్    - మగ మనిషి

212)            Woman   -   ఉమన్  -  ఆడ మనిషి

213)            Work    -   వర్క్   -  పని , పని చేయు

214)            Welcome   -వెల్ కమ్  -  స్వాగతించు

215)            Rice   -   రైస్   -  బియ్యం

216)            Wheat   -   వీట్   -  గోదుమ

217)            Power   -  పవర్  -  సామర్థ్యం , శక్తి

218)            Onion   -   ఆనియన్   -  ఉల్లి

219)            Brinjal   -   బ్రింజాల్   -  వంకాయ

220)            Carrot   -  కేరట్   -  కేరట్ దుంప

221)            Potato   -   పొటాటో  -   బంగాళా దంప

222)            Rich   -   రిచ్   -  ధనికమైన

223)            Poor   -  పూర్  -  పేద యైన

224)            Rain   -  రెయిన్  -  వర్షం

225)            Sun  -  సన్  -  సూర్యుడు

226)            Food   -  ఫుడ్  -  ఆహారం

227)            Later  -  లేటర్  -  తరువాత

228)            Poor   -   పూర్   -   పేదయైన

229)            Taste   -  టేస్ట్   -   రుచి

230)            End  -  ఎండ్  - చివర ,కొన, ముగింపు

231)            Sugar   -   సుగర్ -పంచదార

232)            Pepper  -   పెప్పర్   -  మిరియాలు

233)            Lemon   -  లెమన్   - నిమ్మ

234)            Shirt  -  షర్ట్  -  చొక్కా

235)            Heart  - హార్ట్ -  గుండె

236)            Leaf  -  లీఫ్  - ఆకు

237)            Goat  -  గోట్  -  మేక

238)            Rabbit  - రేబిట్   - కుందేలు

239)            Beautiful  -  బ్యూటిఫుల్  - అందమైన

240)            Stick  - స్టిక్  -  పుల్ల , కొయ్య

241)            Brick  - బ్రిక్  - ఇటుక

242)            Hair  - హెయిర్ - జుట్టు

243)            Idea  - ఐడియా  -  ఉపాయం ,ఆలోచన

244)            Fire  - ఫైర్  - అగ్ని

245)            Forest  - ఫారెస్ట్  -  అడవి

246)            Arm  -  ఆర్మ్  - చేయి ,ఆయుధం

247)            Soil  -  సోయిల్  -  మట్టి

248)            Tomato  - టొమాటో  - టమాటా

249)            Plant  -  ప్లాంట్  -  మొక్క

250)            Tree  -  ట్రీ  -  చెట్టు

251)            Flower  -  ఫ్లవర్  - పుష్ఫం

252)            Prize  -  ప్రైజ్  - బహుమతి

253)            Parents  -  పేరెంట్స్  -  తల్లిదండ్రులు

254)            Thanks  -  థాంక్స్  - కృతజ్ఞతలు

255)            Sand  -  సేండ్  -  ఇసుక

256)            Bottle   -  బోటిల్   -  సీసా

257)            Vegetable  -  వెజిటబుల్  -  కూరగాయ

258)            Yesterday  -  ఎస్టర్ డే  - నిన్న

259)            Tomorrow  - టుమారో  - రేపు

260)            Field  -  ఫీల్డ్  -  పొలము

261)            Garden  -  గార్డెన్ -  తోట

262)            Cow   -  కౌ  -  ఆవు

263)            Milk   -  మిల్క్   -  పాలు

264)            Pigeon   -  పిజన్   -  పావురం

265)            Window  -  విండో  -  కిటికీ

266)            Seed   -  సీడ్   -  విత్తనం

267)            Bottle gourd  -  బోటిల్ గార్డ్  - ఆనప కాయ

268)            Chilies  -  చిల్లీస్   -  మిరపకాయలు

269)            Spinach  -  స్పినాక్   -  ఆకుకూర

270)            Coriander  - కొరియాండర్  -  కొత్తిమీర

271)            Mint  - మింట్  - పుదీనా

272)            Festival  -  ఫెస్టివల్  -  పండుగ , ఉత్సవం

273)            Health  -  హెల్త్  - ఆరోగ్యం

274)            Meals  - మీల్స్  –  భోజనం

275)             Drink  -  డ్రింక్  -  పానీయం

276)            Juice  -  జ్యూస్  -  రసం

277)            Each  -  ఈచ్  - ప్రతీ ఒక్కటి

278)            Metal   -  మెటల్  -  లోహం

279)            Height  -  హైట్  -  పొడుగు

280)            Deep   -  డీప్  -  లోతైన

281)            Not -  నాట్   -  కాదు

282)            Pipe  -   పైప్   -   గొట్టము

283)            Chimney   -  చిమ్నీ - పొగ గొట్టం

284)            Tub   -  టబ్  - తొట్టె

285)            Judge  -  జడ్జి  -  న్యాయాధి కారి

286)            Anyone  - ఎనీవన్  - ఎవరైనా

287)            Exhibition  -  ఎగ్జిబిషన్ -  ప్రదర్శన

288)            Fever  -  ఫీవర్  - జ్వరం

289)            Cold  -  కోల్డ్  -  చల్లని

290)            Cough  -  కఫ్  - దగ్గు

291)            Pain  -  పెయిన్  -  నెప్పి

292)            Picture  -  పిక్చర్  -  చిత్రం

293)            Important  - ఇంపార్టేంట్  - ముఖ్యమైన

294)            Neighbors - నెయ్ బర్స్ -ఇరుగు పొరుగువారు

295)            Buffalo  -  బఫోలో  - పోతు

296)            Season  - సీజన్  -  ఋతువు

297)            Reason  -  రీజన్  -  కారణం

298)            View  -  వ్యూ  -  చూడు , దృష్టి

299)            Need  -  నీడ్  -  అవసరము

300)            Market  -  మార్కెట్  -  బజారు

301)            Soft  -  సాఫ్ట్  - మృదువైన , మెత్తని

302)            Upon  -  అపాన్  -  పైన

303)            Group  -  గ్రూప్  - సమూహం , గుంపు

304)            Fat  - ఫేట్  -  లావు , కొవ్వు

305)            Cream  -  క్రీమ్  - మీగడ ,పలుచని ముద్ద

306)            Number  -  నంబర్  -  సంఖ్య

307)            Early  -  ఎర్లీ  -  ముందరగా

308)            Late  -  లేట్  - ఆలస్యముగా

309)            Sick  - సిక్  -  అనారోగ్యముగా నున్న

310)            Whole  -  హోల్  -  అంతయును

311)            Owner  -  ఓనర్  - యజమాని

312)            Busy  -  బిజీ -  పనిలో ఉన్న, తీరిక లేని

313)            Court  -  కోర్ట్  -  న్యాయస్థానం , ఆవరణము

314)            Guard  -  గార్డ్  - రక్షకుడు, కాపలి వాడు

315)            Cloth -  క్లాత్  - గుడ్డ ,  బట్ట

316)            Angry  -  ఏంగ్రీ  -  కోపంగా

317)            Order  - ఆర్డర్  -  ఆజ్ఞ

318)            Harm  -  హార్మ్  -  హాని

319)            Only  -  ఓన్లీ  - మాత్రమే

320)            Intelligent  -  ఇంటెలిజెంట్  -  తెలివిగల

321)            Mood  -  మూడ్  - మనస్సు యొక్క స్థితి

322)            Role  -  రోల్  -  పాత్ర

323)            Salt - సాల్ట్ - ఉప్పు , లవణము

324)            Street   -  స్ట్రీట్   -  వీథి

325)            Plenty  -  ప్లెంటీ  -  పెక్కుగా , సమృద్ధిగా

326)            Meat  -  మీట్  - మాంసము

327)            Minute  -  మినిట్  -  నిమిషమం

328)            Hour  -  అవర్  -  గంట

329)            Money  -  మనీ  -  సొమ్ము

330)            Enough  - ఇనఫ్  - సరిపడినంత

331)            Wonderful - వండర్ ఫుల్ - ఆశ్చర్యకరమైన

332)            Spider  -  స్పైడర్  -  సాలి పురుగు

333)            Inside  -  ఇన్ సైడ్  -  లోపలి

334)            Jackal  -  జాకల్  - నక్క

335)            Every  -  ఎవ్ రీ   -  ప్రతీ

336)            Tears  - టియర్  -  కన్నీరు,  టేర్ – చింపు

337)            Blood   -  బ్లడ్  -  రక్తం

338)            Around  -  ఎరౌండ్  -  చుట్టుపక్కల

339)            Hospital  - హాస్పిటల్  - ఆసుపత్రి

340)            Office  - ఆఫీస్  -  కార్యాలయం

341)            Immediately  - ఇమీడియట్లీ - వెను వెంటనే

342)            Honey   -  హని   -  తేనె

343)            Dictionary  -  డిక్షనరీ  - నిఘంటువు

344)            Century  -  సెంచరీ  -  శతాబ్ధం

345)            World  -  వరల్డ్  -  ప్రపంచం

346)            Victory  -  విక్టరీ  -  విజయం

347)            Ground   -  గ్రౌండ్   -  మైదానం

348)            Proud   -  ప్రౌడ్  -  గర్వం

349)            News  -  న్యూస్  - వార్తలు

350)            Thread  -  థ్రెడ్  -   దారం , త్రాడు

351)            Another   -  ఎనదర్  - మరియొక

352)            Nature   -  నేచర్   -  ప్రకృతి

353)            Life   -  లైఫ్   -  జీవితం

354)            Different   -  డిఫరెంట్  -  వేరుగా

355)            Power   -  పవర్  - సామర్థ్యము , శక్తి

356)            College  -  కాలేజ్  -  కళాశాల

357)            Great  - గ్రే ట్  -  గొప్పదైన

358)            English  -  ఇంగ్లీష్  -  ఆంగ్లము

359)            Couple  -  కపుల్  - జంట , జోడు ,జత

360)            Disease  -  డిసీజ్  -  వ్యాది

361)            Muscles  - మజిల్స్  - కండరాలు

362)            Birth  - బర్త్  - పుట్టుక

363)            Death   -   డెత్  -  చావు

364)            Dozen  -  డజన్  -  పన్నెండు

365)            Example   -  ఎగ్జాంపుల్ -  ఉదాహరణ

366)            Popularity  -  పాపులారిటీ  -  జన సమ్మతం ,                                                                              .                              బా గా  తెలిసిన

367)            Strength   -  స్ట్రెంత్   -  బలము

368)            Hard   -  హార్డ్  -  కఠినమైన , దృఢమైన

369)            Noun  - నౌన్  -  నామవాచకం

370)            Pronoun  - ప్రొనౌన్  -  సర్వనామం

371)            Verb  -  వెర్బ్  -  క్రియ

372)            Adverb  -  ఏడ్ వెర్బ్- సహాయక క్రియ

373)            Adjective  -  ఏడ్జెక్డివ్  - విశేషణం

374)            Word   -  వర్డ్  -  పదము

375)Sentence  - సెంటెన్స్ - వాక్యం

376) Dream  -  డ్రీమ్  - కల ,కలగను

377)Temple  -  టెంపుల్  -  గుడి

378)Hence  -  హెన్స్ - ఇందువలన, ఇకమీద

379)Past  -  పాస్ట్  -  గతం

380) Present  -  ప్రెజెంట్ -  వర్తమానం , హాజరగు

381)Future  -  ఫ్యూచర్  -  భవిష్యత్తు

382)Almost  - ఆల్ మోస్ట్ - సుమారుగా , దాదాపుగా

383)Blind  -  బ్లైండ్  -  గుడ్డియైన

384)Deaf  -  డెఫ్  -  చెవిటియైన

385)Station  -  స్టేషన్  -  కేంద్రము ,స్థలము

386)However  -  హౌవెవర్  -  ఏదేమైనా

387)Inventor  -  ఇన్వెంటర్  -  కనిపెట్టు

388)Cobbler  - కోబ్లర్  -  చెప్పులు కుట్టేవాడు

389)Heavy  -  హెవీ  -  బరువైన ,  జీర్ణం కాని

390) Light  -  లైట్  -  తేలికైన , దీపం

391)Soldier  - సోల్జర్  -  సిపాయి

392)Request  -  రిక్వెస్ట్  –  ప్రాధేయపడు

393)Battle  -  బేటిల్  -  యుద్ధం 

394) Without  -  లేకుండా ,  కాకుండా

395)Few  -  ఫ్యూ  -  కొద్ది , తక్కువ

396)Dot  -  డాట్  -  చుక్క

397)Also  - ఆల్సో  -  కూడా

398)Hole  -  హోల్  - కన్నము , చిల్లు

399)Bulb  -  బల్బ్  -  గడ్డ ,  దీపం

400)Park  -  పార్క్  -  ఉధ్యాన వనము

401)Husband  - హజ్ బేండ్  -  భర్త

402)Wife  -  వైఫ్  -  భార్య

403)Clock  -  క్లాక్  -  గడియారం

404)Anybody  -  ఎనీ బడీ - ఎవరైన

405)Nobody  -  నో బడీ  -  ఎవ రూ కాని

406)Something  -  సమ్ థింగ్  - ఏదో ఒకటి

407)Nothing  -  నథింగ్  -  ఏమీ లేని

408) Equal  - ఈక్వల్  -  సమామమైన

409)Language  -  లాంగ్వేజ్  -  భాష

410)Paper  -  పేపర్  -  కాగితం

411) Back  -  బేక్  -  వెనుక

412)Front  -  ఫ్రంట్  - ముందు

413)Banana  -  బనాన   -  అరటి

414)Listen  -  లిజన్  -  విను

415) Speak  -  స్పీక్   -  మాట్లాడు

416)Read   -  రీడ్  -  చదువు

417)Write  -  రైట్  -  రాయు

418) Jump  -  జంప్  -  దూకు

419)Run  -  రన్  -  పరుగెత్తు

420)Walk  -  వాక్  -  నడు

421)Eat  -  ఈట్  -  తిను

422)Sing   -  సింగ్  - పాడు

423)Talk  -  టాక్  -  మాట్లాడు

424)Creep  -  క్రీప్  - ప్రాకు

425) Play  -  ప్లే  -  ఆడు

426)Watch  -  వాచ్  -  గమనించు , చూడు

427)Sleep  -  స్లీప్  - నిద్రించు

428)Cry  -  క్రై  -  ఏడు , అరు

429)Drive   -  డ్రైవ్  -  నడుపు

430)Teach -  టీచ్   -  భోధించు

431)Smile  - స్మైల్   -  నవ్వు

432)Help   -  హెల్ప్  -  సహాయం చేయు

433)Tell  -   టెల్   -  చెప్పు

434)Take   -  టేక్   -  తీసుకును

435)Look  -  లుక్  -  చూడు

436)See   -  సీ  -  చూడు

437)Give  - గివ్  -  ఇచ్చు

438)Learn  -  లెర్న్ - నేర్చు

439)Keep  -  కీప్  -  ఉంచు

440)Hear   -  హియర్   -  విను

441)Leave   -  లీవ్  -  విడిచి పెట్టు

442)Climb  -   క్లైంబ్  -  ఎక్కు

443)Drink   -  డ్రింక్  –  తాగు

444)Come  –  కమ్  - వచ్చు

445)Go  -  గో  -  వెళ్ళు

446)Ask   -  ఆస్క్  -  అడుగు

447)Like    -   లైక్    -   నచ్చు

448)Sing   -   సింగ్  -  పాడు

449) Play  -  ప్లే  -  ఆడు

450)Break  -  బ్రేక్  -  పగులు

451)Say  -  సే  -  చెప్పు

452) Know  -  నో  -  తెలియు

453)Buy  - బై  -  కొను

454)Wait   –  వెయిట్  -  ఎదురు చూడు

455)Do  -  డూ  -  చేయు

456)Begin  -  బిగిన్  - ప్రారంబించు

457)Move  –  మూవ్   -  కదులు

458)Sell  -  సెల్  -  అమ్ము

459)Live  -  లివ్ -  జీవించు,  నివసించు

460)Wash  -  వాష్  -  ఉతుకు

461)Sit  -  సిట్  -  కూర్చొను

462)Build  -  బిల్డ్  -  నిర్మించు

463) Draw  -  డ్రా  -  గీయు 

464)Choose  -  చూజ్   - ఎంచు

465)Grow   -   గ్రో   -  పెరుగు

466)Hide  -  హైడ్  - దాయు

467)Use   -  యూజ్  -  ఉపయోగించుt

468)Make  -  మేక్  -  చేయు, తయారు చేయు  

469)Add  -  యాడ్  -  కలుపు

How do lie dector work? అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

How do lie dector work?

అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

How do lie detector work
🔴 ప్రశ్న: అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

🔷 జవాబు: ఒక వ్యక్తి అబద్ధ్దం చెబుతున్నప్పుడు తనకు తెలియకుండానే భావావేశానికి, ఉద్వేగానికి లోనవుతాడు. అపుడు అతని శరీరంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే లైడిటెక్టర్‌ (Lie Detector)ను రూపొందించారు.?

ఇది మానవ శరీరంలో రక్తపోటు, గుండె చప్పుడు, శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి కొన్ని మార్పులను నమోదు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్‌ ట్యూబు (pneumograph tube) అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీ చుట్టూ గట్టిగా కడతారు. ఒక పట్టీని రక్తపోటు కొలవడానికి జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపజేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు కూడా ఆ యంత్రంలో ఉంటాయి.

శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫు ద్వారా నమోదు చేస్తారు. ఈ యంత్రం ద్వారా లభించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా నిందితుడు అబద్ధ్దమాడుతున్నాడా లేదా అనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. న్యాయవ్యవస్థ దీన్ని నేర విచారణలో ఒక సాధనంగానే గుర్తిస్తుంది కానీ కేవలం అది అందించే సమాచారం ఆధారంగానే నేర నిర్ధారణ చేయరు. ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్‌ అనే వైద్య విద్యార్థి, ఒక పోలీసు అధికారి సాయంతో కనిపెట్టాడు.

               

సావిత్రిబాయి పూలే Savitri Bai Pule

 సావిత్రిబాయి పూలే .


👉 సమాజంలో సంస్కరణ భావాలను కార్యాచరణ ద్వారానే ప్రచారం చేయగలం. అందుకు సాహిత్యం కూడా అవసరపడుతుంది               👉 పద్దెనిమిదో శతాబ్దంలో తత్వకవులు మౌఖికంగా ఎన్నో గీతాలు పాడి ప్రచారం చేశారు.                                        👉 మరోవైపు అలాంటి భావాలనే సంస్కర్తలు రాసి సామాజికులకు వినిపించారు.                                 👉  అలాంటి వారిలో సావిత్రి బాయి పూలే ఒకరు.                                       👉🙏 సంస్కర్తలలో చాలామంది పురుషులే ఉన్నారు. కాని ఒక మహిళా సంస్కర్త అయిన సావిత్రిబాయి ఆలోచనలు ఆనాడు ఎలా ఉన్నాయో, ఆమె కవితలు ఎలా ప్రతిబింబిస్తున్నాయో చూద్దాం👏:

👉 పద్దెనిమిదో శతాబ్దంలో కరుడుగట్టిన భూస్వామ్య మత వ్యవస్థకు వ్యతిరేకంగా, పీష్వాల క్రూర రాజ్య హింసను ఎదిరిస్తూ తన జీవిత భాగస్వామి జ్యోతిరావు పూలే అడుగుల్లో అడుగులేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకోసం పాటుపడిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే.            👉  దళితులు , స్త్రీల  అభివృద్ధికోసం సావిత్రిబాయ సమస్త జీవితాన్ని వెచ్చించారు. 👉 మూఢా చారాలకు, మూఢనమ్మకాలకు, అనైతిక పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తితో ఆమె పనిచేశారు.                              👉  ఈ ఉద్యమంలో ఎవరో రాసిన సాహిత్యాన్ని ఆమె ఆసరాగ తీసుకోలేదు. తానే స్వయం గా రచిస్తూ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థకే కాదు, ప్రత్యామ్నాయ సాహిత్యానికి కూడా మార్గాలు తెరిచారు.           తమ సాహిత్యం ద్వారా విజ్ఞాన కాంతులు ప్రసరింపచేశారు                              👉 సావిత్రిబాయి సాహిత్యంలో కవితలు, వ్యాసాలు, లేఖలు, ప్రసంగాలు లభి స్తాయి. రెండు కవితా సంకలనాలు రచించారు. అందులో ఒకటి 23 సంవత్సరాల వయసులోనే పూర్తిచేస్తే రెండవ దానిని జ్యోతిరావ్‌ పూలే మరణానంతరం తమ జీవితచరిత్ర రూపంలో రాశారు.                                       👉 *మొదటి కవితా సంకలనం 1854
లో అచ్చయితే రెండవది 1891
లో అచ్చయింది*.

👉 18వ మరియు 19వ శతాబ్దాలలో భారతదేశ సమాజం భూస్వామ్య విలువలతో నడిచేది.  కుల వ్యవస్థ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలమీద పూర్తి ఆధిపత్యాన్ని కలిగివుండేది. దళితులు, మహిళల పరిస్థితి చాల దయ నీయంగా ఉండేది. దళితుల మీద అనేక ఆంక్షలు విధించేవారు.                        👉 కులాల నియంత్రణలో ఉన్న భారతీయ సమాజంలో మానవ విలువలు అడుగంటిపోయాయి. సర్వత్రా ఈర్ష్యాద్వేషాలు. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానం, దారిద్య్రం, అంటరానితనం. శతాబ్దాల క్రితం సమాజంలో ఓ తెలివైన వర్గం పెద్దపెద్ద కుట్రలు పన్నింది.                        👉 సావిత్రిబాయి తమ రచనల ద్వారా ఒక్కొక్క కుట్రను పటాపంచలు చేశారు. సావిత్రిబాయి సమాజంలో నెలకొన్న అజ్ఞానాన్ని తెలుసుకోమని, తెలుసుకొని దానిని జీవితంలోనుంచి తరిమివేయమని చెపుతారు.                                👉 ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో మత ధార్మిక విషయాలు సమాజంలో ప్రభావం చూపుతున్నాయి. మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాయి. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలలోం పెంపొందించవలసిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉంది అని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నా ఈ రోజు దానిని ఏమాత్రం ఖాతరు చేయని పరిస్థితి                    👉 *ఒక కవితలో సావిత్రిబాయి వైజ్ఞానిక దృక్పథంతో ఈ స్థితిని వివరిస్తారు; రాయికి కుంకుమపెట్టి/నూనెలో ముంచి/దేనినైతే దేవత అంటున్నారో/ నిజానికది రాయేకదా’’ అంటూ రాళ్ళకు మొక్కితే పిల్లలు పుడితే/ మరి అకారణంగా  / స్త్రీ పురుషులు పెళ్ళెందుకు చేసుకుంటారు?’’ అని ప్రశ్నిస్తారు. నేటి సమాజంలో  దళితులు, శూద్రులు, మహిళల దుర్దశకు కారణాలనేకం.  శూద్రులు పనిచేయకూడదని, పనిచేసి ధనం సంపాదించకూడదని మను చెప్తాడు. ఈ విషయాన్ని సావిత్రిబాయి ఒక కవితలో ఇలా ప్రస్తావిస్తారు;                

👉 సమకాలీన సామాజిక అంశాలనే కాదు, చారిత్రక అంశా లను కూడ సావిత్రిబాయి తమ కవితలలో రాశారు. నలరాజు, బలి మహారాజు, ఛత్రపతి శివాజీ, తారాబాయి మొదలైనవారి గురించి కవితలలో ప్రస్తావించారు. అంతేకాదు, ప్రకృతిమీద రాసిన కవితలు ఆమె వర్ణనాశక్తిని తెలియచేస్తాయి. ఆమె రాసిన సీతాకోక చిలుకలు’ కవిత మంచి ఉదాహరణ. రంగురంగుల అందమైన/ సీతాకోక చిలుకలు/ మెరిసే కళ్ళు, ఇంద్రధనుస్సు నవ్వు/ దేహంపై పట్టుల్లాంటి/రెక్కలు/చిన్న పెద్ద, ముడుచుకుని ఉండె/ పసుపు రంగు రెక్కలు/ అయినా, ఆకాశంలోకి ఎగురుతాయి/వాటి రూపం రంగు మనో హరం/సీతాకోక చిలుకలను చూస్తూ చూస్తూ/నన్ను నేను మరచిపోయాను’’. *👉మొదటి కవితా సంకలనంలో అమ్మ గురించి, మాతృభూమి గురించి అలగే జ్యోతిరావ్‌ పూలే గురించి ఎంతో ఆత్మీయంగా కవయిత్రి తమ భావాలను పంచుకుంటారు.                 👉 👉అమ్మగురించి రాస్తూ ఇలా అంటారు ‘ఆమె ముందు సముద్రం కూడ/చిన్నబోతుంది/ ఆమె ముందు ఆకాశం కూడ/ తలదించుకుంటుంది’’.

👉అజ్ఞానం  అనే
శత్రువొక్కటే మనందరికి.
దానిని తన్ని తరిమి కొడ్దాం
దానిని మించిన మరో
శత్రువు లేదు మనకు

👉వెతికి తీయండి
మనస్సు లోపల చూసి పట్టుకోండి
వెతికి పట్టుకున్నారా శత్రువుని?
చూశారా శత్రువుని?
బాగా ఆలోచించి చెప్పండి పిల్లల్లారా
దాని పేరు చెప్పండి వెంటనే మరి
మీకు  తెలియదా?

👉ఓటమిని ఒప్పుకోకండి, కొంచెం ఆలోచించండి
సరే ఆ దుష్ట శత్రువు పేరు
నేనే చెప్తాను
నా మాటను జాగ్రత్తగా వినండి
అలసత్వాన్ని వీడండి
దాని పేరు అజ్ఞానం
గట్టిగా పట్టుకుని దాని గొంతు పిసికేయండి
జీవితం నుంచి తరిమిగొట్టండి

👉విద్య లేదు జ్ఞానం లేదు
చదువుకుని విద్యావంతులు కావాలనే ఆలోచన లేదు
తెలివి ఉన్నా వ్యర్థంగా కోల్పోతారు
వారిని మనుషులని ఎలా అనను?

👉చేతులు ముడుచుకుని కూర్చుంటారు
పశువులు కూడా అలా వ్యవహరించవు
ఆలోచన లేదు, ఆచరణ లేదు
వారిని మనుషులని ఎలా అనను?

👉ఇంటి నిండా పిల్లలు
చే యరు వారిని పోషించడానికి
ఎలాంటి ప్రయత్నం
వారిని మనుషులని ఎలా అనను?

👉 *దొరకదు వారికి ఎవరి సహానుభూతి
సహాయం చేయరు వారికి ఎవరు
పట్టించుకోరు*  *వారిని ఎవరు
సవారిని మునుషులని ఎలా అనను*?

👉జ్యోతిష్యం, పంచాంగం, హస్తరేఖల చుట్టూ
తిరిగెదరు మూర్ఖులు
స్వర్గం నరకం కల్పనలో మునిగిపోయెదరు
పశువుల జీవితంలో కూడా
ఇలాంటి భ్రమలకు లేదు ఎలాంటి స్థానం
వారిని మనుషులని ఎలా అనను?

👉భార్య పాపం పనిచేస్తూనే ఉంటుంది
ఏకష్టం లేకుండా భర్త నిస్సిగ్గుతో తింటూనేఉంటాడు

👉పశువులలో కూడా లేదు ఇలాంటి వింత
వారిని మనుషులని ఎలా అనను?

👉ఇంట్లో బయట దారిద్య్రం ఆవరించే
లేరెవరు కనీసం పలకరించడానికి
అందరూ వారిని ధిక్కరించుదురు
వారిని మనుషులని ఎలా అనను?

👉చదువలేరు రాయలేరు
మంచి మాటను చెవిన పెట్టరు
పశువులు సైతం అర్థం చేసుకుంటాయి
కానీ, ఈ మూఢులకు మాత్రం అర్థం కాదు
వారిని మనుషులని ఎలా అనను?

👉తమ పశుత్వం పట్ల లేదు సిగ్గు
అదే సుఖమని భావించెదరు
పశు మార్గంలో నడిచెదరు
వారిని మనుషులని ఎలా అనను?

*👉ఎవరైతే ఇతరులకు సహాయం చేయరో
సేవ, త్యాగం, దయ, మమతలను దరిచేయనీయరో
ఎలాంటి సద్గుణాలను అలవర్చుకోరో
వారిని మనుషులని ఎలా అనను*?

*👉బానిసత్వం గురించి బాధ పడని వారు
అభివృద్ధి సంకల్పంలేని వారు
మానవత్వాన్ని అణగద్రొక్కే వారిని
మనుషులని ఎలా అనను*?

👉పశు పక్షులు  క్రిమి కీటకాలు*, వానరులు నరులు
పుట్టుక గిట్టుక సమస్త చరాచరులకు సమానం*
ఈ మాత్రం జీవిత సత్యం కూడా తెలియని వారు
వారిని మనుషులని ఎలా అనను*?                       

జోహాన్స్ కెప్లర్ (Johannes Kepler),

"జోహాన్స్ కెప్లర్"(Johannes Kepler) 

(డిసెంబరు 27, 1571 – నవంబరు 15, 1630) ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. ఇతడు గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. 17వ శతాబ్దం జరిగిన ఖగోళశాస్త్ర ప్రభంజనంలో కీలక పాత్ర పోషించాడు. ఇతన్ని కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం ద్వారా అందరూ గుర్తిస్తారు. ఇతన్ని గ్రహాల పరిభ్రమణంతోపాటు, ఈయన ప్రతిపాదించిన వివిధ సిద్ధాంతాలు 17 శతాబ్దంలో విప్లవాన్ని సృష్టించాయనే చెప్పవచ్చు.

🌷కనుక్కోనదాన్ని గురించీ🌷🍀గ్రహాల పరిభ్రమణానికి సంబంధించి ఈయన మూడు సూత్రాలు ప్రతిపాదించాడు. టుబెజిన్ యూనివర్సిటీలో ఆయన తత్వశాస్త్రం, గణితం, అంతరిక్షశాస్త్రానికి చెందిన నైపుణ్యాలను బాగా వృద్ధి చేసుకున్నాడు. ఈయన అప్పటి కాలానికే చెందిన గెలిలియోకు సమకాలీనుడు. గ్రహాల కదలికలపై కెప్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు, తర్వాతి కాలంలో న్యూటన్ సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి ఎంతగానో ఉపయోగపడింది. . ఆస్ట్రియా గ్రాజ్‌లోని ప్రొటెస్టెంట్ పాఠశాలలో గణితం, ఖగోళశాస్త్రాల ఉపాధ్యాయుడిగా చేరారు. తర్వాత టుబిన్‌జెన్ విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేశారు. ఖగోళ, జ్యోతిష, గణిత, తత్వ శాస్త్రాలపై అధ్యయనం చేశారు. గ్రహాల కొత్త కక్ష్యల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త టైకో బ్రాహి కెప్లర్‌ని తన సహాయకుడిగా నియమించుకున్నాడు. టైకో బ్రాహి మరణాంతరం ఇంపీరియల్ గణిత శాస్త్రవేత్తగా కెప్లర్ పదవిని పొందారు. గణన చేయడానికి వర్గమానాలను ఏవిధంగా ఉపయోగించవచ్చో వివరించారు. గ్రహగతులకు సంబంధించి మూడు నియమాలు ప్రతిపాదించారు. కోపర్నికస్ తెలియజేసిన విషయాలను మెరుగుపరిచి వాటిని అభివృద్ధి చేశారు. కెప్లర్ గతి నియమాలు, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడ్డాయి.

🌷1630లో నవంబరు 15న తన 58వ ఏట జర్మనీలోని రెజెన్స్‌బెర్గ్‌లో మరణించారు.🌷

🍁స్మృతి చిహ్నాలు

🍀చెక్ రిపబ్లిక్ ప్రేగ్‌లో టైకోబ్రా, కెప్లర్ శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు.

🌸2002లో కెప్లర్ చిత్రం ఉన్న 10 యూరోల వెండి నాణెం విడుదల చేసారు.

🌸జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆయన చిత్రాన్ని కలిగి ఉన్న తపాలా బిళ్ల విడుదలజేసింది.🌸
🍁కెప్లర్ గౌరవార్థం, నామకరణాలు

🍀నాసా కెప్లర్ గౌరవార్థం 2009 మార్చి6న ఒక మిషన్‌ను ఏర్పాటు చేసింది
కెప్లర్ అంతరిక్ష వేధశాల, అమెరికా  



"లూయీ పాశ్చర్"

లూయీ పాశ్చర్

🍀 ఫ్రెంచి సూక్ష్మజీవశాస్త్రజ్ఞుడు మరియు రసాయనవేత్త.

🍀  జననం    డిసెంబరు 27, 1822
డోలె, ఫ్రాంచే కోమ్టే, ఫ్రాన్స్.

🍀  మరణం    1895 (వయసు 72)
మార్నెస్ లా కోకెట్, హాట్స్ దే సీన్, ఫ్రాన్స్.

🍀 లూయీ పాశ్చర్ (ఆంగ్లం Louis Pasteur) (డిసెంబరు 27, 1822 – సెప్టెంబరు 28, 1895) ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. *వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఈతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.

🍀 చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఈ పద్ధతిని నేడు పాశ్చరైజేషన్ అంటారు.

🍀 ఇతన్ని సూక్షజీవశాస్త్రం వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరుగా పేర్కొంటారు; మిగిలిన ఇద్దరు రాబర్ట్ కోచ్ మరియు ఫెర్డినాండ్ కాన్
ఈతని మరణం తరువాత పారిస్ లోని పాశ్చర్ సంస్థ భూగర్భంలో పాతిపెట్టారు. ఈ ఘనత దక్కిన 300 మంది ఫాన్స్ దేశస్తులలో ఇతడొకడు.

🍁జీవితచరిత్ర    🍁
  పాశ్చర్ 1822 @సంవత్సరం డిసెంబరు 27న ఫ్రాన్స్ లోని డోల్ గ్రామంలో @జన్మించాడు. నెపోలియన్ సైన్యంలో పనిచేసిన తండ్రి జీన్ పాశ్చర్ తోలు వ్యాపారం చేసి జీవించేవారు. పాశ్చర్ పాఠశాలకు వెళ్ళకుండా కొంతవరకు విద్యావంతుడయ్యాడు. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవాడు. తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారివి, స్నేహితులవి బొమ్మలు పెయింట్ చేశాడు. చాలా చిత్రాలు ఇప్పటికీ పాశ్చర్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాశ్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలనుకొనేవాడు. పదహారేళ్ల వయసులో కాలేజీ చదువు కోసం పారిస్ లో అడుగుపెట్టాడు. డాక్టరేట్ పూర్తిచేసి 1848లో స్ట్రాస్ బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. యూనివర్సిటీ వైస్      ఛాన్స్ లర్ కు వారి అమ్మాయి మేరీ లారెంట్ ను పెళ్ళిచేసుకుంటానని అనుమతికోసం లేఖ రాశాడు. 1849 మే 29న వీరిద్దరు పెళ్ళిచేసుకున్నారు. ఆదర్శదంపతుల్లాగా జీవించారు. వీరికి అయిదుగురు పిల్లలు పుట్టినా ముగ్గురు మరణించారు; టైఫాయిడ్ వల్ల ఇద్దరు, మశూచి వల్ల ఒకరు పిల్లల్ని పోగొట్టుకొన్నాడు.

🍁శాస్త్ర పరిశోధన🍁
 పాశ్చర్ అంగారక పదార్ధాలు ధ్రువిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసి "స్టీరియో కెమిస్ట్రీ" అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించారు. తరువాత తన పరిశోధనలను పులియడం (Fermentation) వంటి అంశాలపై కొనసాగించి సూక్ష్మక్రిములపై అనాదిగా ఉన్న భావాలను ఖండించి కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు. *ద్రాక్షసారా (Wine) వల్ల వచ్చే వ్యాధులు, నిల్వచేసే పద్ధతులు, వెనిగర్ తయారీ మొదలైన అనేక అంశాలపై కొత్త విషయాలు కనుగొన్నాడు.

🍀 కోళ్ళకు వచ్చే కలరా వంటి పారుడు వ్యాధిపై పరిశోధన జరిపి వ్యాధికారకాలైన సూక్ష్మజీవులను బలహీనపరచి ఇతర కోళ్ళకు ఎక్కించి వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి తర్వాత కాలంలో రోగం రాకుండా రక్షిస్తుందని నిర్ణయానికి వచ్చారు.

🍀 పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధికి మందు కనిపెట్టడం Louis పాశ్చర్ సాధించిన శాస్త్ర విజయాలలో ప్రధానాంశం. ఈ మందుతో చాలా మందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు.

🍀 1870 దశాబ్దంలో టీకా పద్ధతులను పశువులలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మీద ప్రయోగించాడు.

🍀 ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనిషులు గాని, జంతువులు గాని అంటు వ్యాధితో మరణిస్తే ఆ శవాన్ని దహనం చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు.

🌷పాశ్చర్ pasture సుక్ష్మజీవశాస్త్రంలో అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని 1895లో పొందారు.🌷

 పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు.

🌷సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం.🌷

🌷రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ 1895 సెప్టెంబరు 28న పరమపదించారు.🌷                       

Monday, December 26, 2016

సాలార్‌జంగ్‌ మ్యూజియం

1951 డిసెంబర్ 16 సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.

salarjung museum working days
🌷సాలార్ ‌జంగ్ మ్యూజియం🌷

🍀స్థాపన: 1951

🍀ప్రదేశం: నయాపూల్, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

🍀సేకరణ: 10 లక్షలు

🍀సందర్శకులు: 11,24,776 March 2009 నాటికి

🍀వెబ్  : http://www.salarjungmuseum.in/

🍀సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున గలదు. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు మరియు జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి.

🌷చరిత్ర 🌷

🍀హైదరాబాద్ యొక్క సాలార్ జంగ్ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా మరియు దూర ప్రాచ్య దేశాలలో యొక్క కళాత్మక వస్తువుల భాండాగారం. ఈ సేకరణ ప్రముఖంగా సాలార్ జంగ్ III సేకరించారు. 1914 లో, సాలార్జంగ్ తర్వాత HEH ప్రధాన మంత్రి, నిజాం VII, నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్, సేకరించారు. నలభై సంవత్సరాల కాలంలో అతనికి ద్వారా సేకరించిన విలువైన మరియు అరుదైన కళ వస్తువులు, కళ వంటి అరుదైన చాలా అరుదైన ముక్కలు సాలార్ జంగ్ మ్యూజియంలో ఉన్నాయి.

🍁సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతిపెద్ద సంగ్రహాలయంగా ఉంది.🍁

🍀వివిధ నాగరికతలు చెందిన సేకరణలు మరియు 1వ శతాబ్దం చెందిన పురాతన వస్తువులకు భారతదేశంలో ప్రసిద్ధి. 1951 డిసెంబరు 16 న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడింది.

🍀హైదరాబాదుకు చెందిన నిజామ్ పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి ఉన్నాయి. ఈ సేకరణలన్నీ దాదాపు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ IIIగా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ II" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ I"కు చెందినవి.

🌷సేకరణలు 🌷

🍀సాలార్ జంగ్ కు చెందిన నగరమహలులో 78 గదులలో 40,000 వస్తువులు గలవు.

🌾ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా", జహాంగీర్ చురకత్తి, నూర్జహాను పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.🌾

🍁సేకరణల్లో గ్రంథాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండి తెప్పించి భద్రపరచబడినవి.🍁

🌾భారత పార్లమెంటు, ఈ సంగ్రహాలయాన్ని "జాతీయ ప్రాముఖ్యం" గల సంగ్రహాలయంగా గుర్తించింది.🌾

🌷సందర్శన సమయాలు🌷

🍀ఈ మ్యూజియం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకూ సందర్శకులకొరకు తెరవబడి యుంటుంది. (శుక్రవారం శెలవు).

ఉద్యోగం పురుష లక్షణం

*ఉద్యోగం పురుష లక్షణం*


"ఏం..వదినా..అన్నయ్య ఆఫీసుకెళ్ళారా..?"
అని పక్కింటి పంకజ ను పలకరించింది సరోజ.

"లేదు వదినా..వారం రోజులుగా ఆఫీసుకు సెలవు పెట్టి ATM ల చుట్టూ తిరుగుతున్నారు" అని బదులిచ్చింది పంకజ.

"అయ్యో! పాపం. అందరికీ అదే కష్టం వచ్చింది వదినా. కార్డుకు 2000 రూ|| మాత్రమే ఇస్తున్నారంట కదా. ఇంతకూ ఓ 4000 రూ|| అయినా తెచ్చారా లేదా?" అని అడిగింది సరోజ.

"రోజుకు ఐదారు వేల చొప్పున ఇప్పటికి 30,000 రూ|| సంపాదించారు" అని గర్వంగా మురిసిపోతూ సమాధానమిచ్చింది పంకజ.

ఖంగుతిన్న సరోజ "ఆఁ..!!" అని నోరు వెళ్ళబెట్టి " ఎన్ని కార్డులు పట్టుకెళుతున్నారేంటి?" అంది.

"కార్డులతో పనే లేదు వదినా. ఒక క్యాను నిండా టీ, ఒక సంచి నిండా సమోసాలు పట్టుకెళ్తే చాలు. సాయంత్రానికి అవన్నీ అమ్ముడుపోయి ఐదారు వేలు చేతికొస్తున్నాయ్. రోజూ పొద్దున్నే నిద్రలేచి అవి రెండూ సిద్ధం చేసుకుంటున్నారు మీ అన్నయ్య" అని అసలు రహస్యం చెప్పేసింది పంకజ.

"థ్యాంక్స్..వదినా. రేపటి నుంచి మా వారిని కూడా ఓ వారం రోజులు సెలవు పెట్టమని చెప్తా" అని వెలిగిపోతున్న ముఖంతో ఇంటిలోకి పరుగెత్తి సెల్ ఫోన్ తీసి తన భర్తకు డయల్ చేయడం మొదలెట్టింది సరోజ.  

నీలం రాజశేఖరరెడ్, తేళ్ళ లక్ష్మీకాంతమ్మ, కొక్కొండ వెంకటరత్నం పంతులు, మాకినేని బసవపున్నయ్య

డిసెంబర్ 13 నీలం రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా..

🌷నీలం రాజశేఖరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు. 1918లో అనంతపురం దగ్గర ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.🌷

🍀స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు బెనారస్ జాతీయ కళాశాలలో రాజశేఖరరెడ్డిని, తరిమెల నాగిరెడ్డి ని చేర్పించారు.

 🌷మానవునికున్న ఆస్తిలో కెల్లా ప్రియమైనది జీవితమే! అలాంటి జీవితాన్ని గడిపే అవకాశం మనిషికి ఒకసారి మాత్రమే లభిస్తుంది. మానవజాతి విముక్తికోసం నా జీవితాన్ని వినియోగించాను అని సంతృప్తి పడగల జీవితాన్ని ప్రతి మానవుడూ గడపాలి-y అన్న లెనిన్ మాటలు నీలంకు ఆదర్శం.🌷

🍀1943 జనవరిలో అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రథమ కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. 1946లో 'అనంతపురం జిల్లా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర రాశారు. 1938లో కమ్యూనిస్టు పార్టీలో చేరి మూడు సంవత్సరాలు రహస్య జీవితం గడిపాడు. 1941-42లో యుద్ధాన్ని వ్యతిరేకరించినందుకు, యుద్ధ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసినందుకు రెండున్నర సంవత్సరాలు జైలు జీవితం. ఆగ్రా సెంట్రల్ జైలు, బెనారస్ జిల్లా జైలు, చెరైలీ సెంట్రల్ జైలు, రాజమండ్రి, ఆలీపూర్, వెల్లూరు... ఇలా దేశంలో ప్రసిద్ధి పొందిన అన్ని జైళ్లల్లోనూ బందీ అయ్యారు.

🍀ఆయన ఆస్తిని 1952 ప్రాంతాల్లో పోలీసులు జప్తు చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన నీలం తన యావదాస్తిని కమ్యూనిస్టు ఉద్యమానికే అంకితం చేశారు. చండ్ర రాజేశ్వరరావు, తమ్మారెడ్డి సత్యనారాయణ ల పేరుతో ఏర్పాటైన ట్రస్టులకు అధ్యక్షుడిగా పనిచేశారు.

 🌸1994 డిసెంబరు 13న నీలం కన్నుమూశారు.🌸

🌷చండ్ర రాజేశ్వరరావు పౌండేషను మార్కిస్టు అధ్యయనానికి హైదరాబాదు శివార్లలోని కొండాపూర్లో ఏర్పాటుచేసిన పరిశోధనా కేంద్రానికి రాజశేఖరరెడ్డి స్మృత్యర్ధం "నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం" అని పేరుపెట్టారు.🌷                                             


















డిసెంబర్ 13 తేళ్ళ లక్ష్మీకాంతమ్మ  వర్ధంతి సందర్భంగా..... 🌹🌻

🌺తేళ్ల లక్ష్మీకాంతమ్మ (జూలై 16, 1924 - డిసెంబర్ 13, 2007) ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత ఆమె మనవరాలే.లక్ష్మీకాంతమ్మ 1924, జూలై 16న జన్మించింది. ఈమె స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి ఆర్థిక శాస్త్రములో ఎం.ఏ పట్టా పొందిన లక్ష్మీకాంతమ్మ టి.వి.సుబ్బారావును వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు.

🍀లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1967లో పార్లమెంటు బృందంలో సదస్యురాలిగా ఆస్ట్రేలియాను పర్యటించింది. 1978లో జనతా పార్టీ తరఫున హైదరాబాదు నగరంలోని హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి గెలుపొందింది.

🍀పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది.ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.

🌷లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు సన్నిహితురాలు. నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ది ఇన్‌సైడర్‌లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు.🌷

🍁ఈమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షాఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించింది.🍁

*🌸లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో విజయవాడలోని తన కూతురు ఇంట్లో డిసెంబర్ 13, 2007న మరణించింది.?                    







                  


డిసెంబర్ 14 మాకినేని బసవపున్నయ్య జయంతి సందర్భంగా.....🌹🌻

🌷మాకినేని బసవపున్నయ్య🌷

🌸మాకినేని బసవపున్నయ్య (డిసెంబర్ 14, 1914 - ఏప్రిల్ 12, 1992) మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు.🌸

🌷జననం🌷

🌸ఈయన గుంటూరు జిల్లా తూర్పు పాలెంలో 1914, డిసెంబర్ 14 న జన్మించాడు.🌸

🌷రాజకీయ ప్రస్థానం🌷

🍁గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బి.ఎ చదివాడు. 1930లో స్వాతంత్ర్య పోరాటములో పాలు పంచుకొని, కాంగ్రెస్ నాయకత్వము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపు చేయడంతో అసంతృప్తి చెంది 1934లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్ గా 1934-40 కాలంలో పనిచేశాడు. 1936లో జరిగిన విద్యార్థిసంఘం సంస్థాపక మహాసభలో జతీయ స్థాయి ఉప కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1940 వరకు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థిసంఘం కార్యదర్శిగా విద్యార్థిఉద్యమం నడిపాడు. అదే సంవత్సరం గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యత స్వీకరించాడు. 1943లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1948లో కలకత్తాలో జరిగిన సి.పి.ఐ ద్వితీయ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1950లో పొలిట్ బ్యూరోకి ఎన్నికయ్యాడు. ఆ స్థానంలో 40 సంవత్సరాలు కొనసాగాడు.

🍁మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. తెలంగాణా రైతాంగ పోరాటములో ప్రముఖ పాత్ర వహించాడు. సుందరయ్య లాంటి నాయకులతో కలిసి తెలంగాణా సాయుధ పోరాటములో పాల్గొన్నాడు. భారత దేశములో విప్లవ సాధనకు అనుసరించవలిసిన వ్యూహం గురించి కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ మొదలు పెట్టాడు. ఈ చర్చ చివరకు 1964లో సి.పి.ఐ (యం) ఆవిర్భావానికి దారి తీసింది. ఈ సందర్భములో బసవపున్నయ్య సోవియట్ కమ్యూనిస్ట్ నాయకులు స్టాలిన్, మాలటొవ్, సుస్లోవ్, మాలెంకోవ్ లతో చర్చలు జరిపాడు. 1957లో జరిగిన ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీల మహాసభలలో మావొసేతుంగ్, లీషావ్ చీ, చౌ ఎన్ లై లతో చర్చలు జరిపాడు. కమ్యూనిస్ట్ సిద్ధాంతము పట్ల నిబద్ధతతో బాటు ప్రగాఢమైన దేశభక్తి కలవాడు.

🌸రాజ్యసభ సభ్యునిగా 1952 నుంచి 1966 వరకు పీడిత ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు. చైనాతో యుద్ధం సందర్భముగా కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సార్లు జైలులో పెట్టింది. బసవపున్నయ్య ఆనాడు చెప్పిన అంశాలను చాలాకాలము తరువాత భారత పాలక వర్గాలు అంగీకరించాయి.🌸

🍁సి.పి.ఐ (యం) అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ సంపాదకునిగా 14 సంవత్సరాలు పనిచేశాడు.🍁

🌷మరణం🌷

🌸బసవపున్నయ్య ఢిల్లీలోని తన నివాసములో 1992, ఏప్రిల్ 12 న మరణించాడు.🌸                    



























డిసెంబర్ 14 మహామహోపాధ్యాయ "కొక్కొండ వెంకటరత్నం పంతులు"  వర్ధంతివ సందర్భంగా.....🌹🌻

🌷కొక్కొండ వెంకటరత్నం పంతులు (మార్చి 14, 1842 -14 డిసెంబర్, 1915), మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత, పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు, గ్రాంధికం తప్ప ఇతర భాష మాట్లాడని వాడు. వీరు "ఆంధ్రభాషా జాన్‌సన్" అనే గౌరవం పొందిన పండితులు. ఆంధ్ర వాజ్మయంలో నవయుగ ప్రవర్తక త్రయం (చిన్నయసూరి, వెంకటరత్నము, వీరేశలింగము) లో వీరు మధ్యమ స్థానాన్ని ఆక్రమించారు.🌷

🍀ఇరవై రెండు సంవత్సరాలు మద్రాసు రాజధాని కళాశాలలోను, ఎనిమిది సంవత్సరాలు రాజమండ్రి కళాశాలలోను తెలుగు పండితులుగా పనిచేసారు. పుట్టుకతో ద్వైత మతానికి చెందినా శంకరాద్వైతాన్ని స్వీకరించి నియోగియైనవారు. శ్రీ బిల్వనాథ క్షేత్రంలో బిల్వేశ్వరుని ఉపాసించి వారి కరుణాసిద్ధిని పొందిన మహాభక్తులు.

🍀ఈయన 1871 లో ‘ఆంధ్రభాషా సంజీవిని’అనే పత్రికను 20 వత్సరాలు నడిపారు. చెన్నైలో ఆంధ్రులచే నడుపడిన పత్రికలో ఇదే మొదటిది. తర్వాత ‘హాస్యవర్ధని’ అనే పత్రికను నడిపాడు. హిందూ శ్రేయోభివర్ధనీ సభను స్థాపించి, ఆంధ్రభాషలో వక్తృత్వం, ఉపన్యాస పద్ధతి నెలకొల్పి వాటిద్వారా ఆర్యమత ప్రచారం కావించారు.

🍀శ్రవ్యకావ్యాలను, 5 రూపకాలను, అజామీళోపాఖ్యానం అనే యక్షగానమును రచించాడు. ఈయన అనువదించిన ఐదు రూపకాలలో కేవలం మూడు మాత్రమే ముద్రించబడ్డాయి. అవి నరకాసుర విజయవ్యాయోగం (1872), ధనుంజయ విజయ వ్యాయోగం (1894), ఆంధ్ర్రపసన్న రాఘవం (1897) . ‘పౌండరీకం’ అనే భాణము, శ్రీమతి బాధవం అనే నాటకము ముద్రితం కాలేదు. సంస్కృత నాటకాలను అనువదించడంలో పద్యానికి పద్యం, గద్యానికి గద్యం వరుసగా వ్రాసే పద్ధతిని ఈయనే ఏర్పరచాడు. ఈ పద్ధతి నేటికీ అవలంభించబడుతోంది.
🍀నరకాసుర విజయవ్యాయోగం రెండవ సంస్కృతాంధ్రనువాదమైనా, లభ్యమైన వాటిలో నరకాసుర విజయవ్యాయోగమే మొదటి సంస్కృతాంధ్రానువాదంగా పేర్కొనబడుతుంది.

🌷జీవిత విశేషాలు🌷

🍀తల్లి రామాంబ, తండ్రి నరసింగరావు పంతులు గారు. జననం మార్చి24, 1843 వినుకొండలో. వీరు మాధ్యులు. తండ్రిగారు1845 లో మరణించారు.మేనమామ అప్పయ సోమయాజి. నందిరాజు లక్ష్మీనారాయణ దీక్షితులు గారు వెంకటరత్నంగారి తల్లికి పెదతండ్రి. వెంకటరత్నం గారు సంస్కృతాంధ్ర గ్రంథములు ఇంటివద్దనే చదువుతూ ఇంగ్లీషు పాఠశాలలో చదివారు. 1855 లో వివాహం. మేనరిక్కం. 15 వ ఏటనే గుంటూరు కలెక్టరు కచ్చేరీలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు. చిన్నప్పుడే కవిత్వం అబ్బినది. వెంకటరత్నం పంతులు గారు స్మార్తులైనారు. 1856 లో మొట్టమొదటి పర్యాయము చన్నపట్టణం వెళ్ళారు. 1856 కాళయుక్తసంవత్సరంలో కంపెనీసర్కారు వారి సర్వే పార్టీలో ఉద్యోగమునకు దరకాస్తుచేశారు. సేలంలో సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది. అటుతరువాత కోయంబత్తూరు దగ్గర పాల్ఘాట్ కు వెళ్లి అక్కడ తెలుగు పాఠశాల పెట్టారు. అందులో కన్నడం మరియు అరవం కూడా బోధించేవారు.

🍀కోయంబత్తూరులో నారాయణ అయ్యర్ వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. 1864 లో వారి తల్లిగారు ఉడుపి యాత్రలో మరణించారు. 1863లో సర్వే పార్టీ మూసివేసినతరువాత 1866 లో చన్నపట్టణం రెవెన్యూబోర్డులో ఉద్యోగం చేశారు. 1870 లో చన్నపట్టణంలో హిందూ ప్రొప్రయటరీ స్కూలులో తెలుగు పండితులుగా చేరారు. 1870 సంవత్సరములో హిందూశ్రేయోభివర్ధనీ సమాజమును స్థాపించి దానిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను సమావేశ పరచి ఒకొక్క సారి ఒకొక్క విషయమునుగూర్చి ఉపన్యాసముచేశేవారు. 1871 లో ఆంధ్ర భాషాసంజీవని పత్రిక స్ధాపించారు. అందులో పత్రికాలక్షణములు గురించి, పత్రికాసంపాదకులక్షణముల గురించి పద్యాలు వ్రాసేవారు. ఆ ఆంధ్ర భాషాసంజీవనిలో ఇంగ్లీషు పత్రికలమాదిరి Editorials ప్రారంభించారు. ఆ పత్రిక 1871 నుండీ 1883 వరకూ నడచింది. అటుతరువాత మళ్ళీ 1892 నుడీ 1900 వరకూ నడిచింది. బందరునుండి ప్రచురించబడే పురుషార్ధప్రదాయనీ పత్రిక 1872 జూలై సంకలనంలో కొక్కొండవారి ఆంధ్ర భాషాసంజీవని గూర్చి ప్రశంసిస్తూ ఇంగ్లీషులోను తెలుగులోనూ సమీక్షలు ప్రకటించారు. ఆ పత్రికలో ప్రచురించబడిన ముఖ్యవిషయములను ఇంగ్లీషు ప్రభుత్వ ట్రాన్సలేటర్ ( Govt. Translator) లెఫ్టనెన్టు కర్నల్ లేన్ దొర గారు (Lt.Col Lane) ఇంగ్లీషులోకి తర్జుమాచేసి ప్రతినెలా మద్రాసు ప్రభుత్వమునకు రిపోర్టు పంపిచేవారు. 1874 నవంబరులో వీరి ఆంధ్రభాషా సంజీవని పత్రికలో సంజీవిని సమాచారమని పేరుతో దేశ పరిపాలన వ్యవహారములను గూర్చిన 16 ప్రశ్నలు ప్రకటించారు. ఈ ప్రశ్నలు తమ పాఠకులు చదివి తమ అభిప్రాయాలను కారణాలు ఉదాహరణలు వ్రాసి పంపమని పత్రికాధివతి కోరారు. ఆ 16 ప్రశ్నలనూ గూడా ప్రభుత్వ ట్రాన్స్ లేటర్ కర్నల్ లేన్ దొర ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ 16 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య చరిత్ర మొదటి సంకలనములో 58 వ చారిత్రక పఠముగా "Report on Telugu Newspaper for November 1874"లో ఉంది.

🍀1874 అక్టోబరులో స్ధాపించిన కందుకూరి వీరేశలింగం గారి వివేకవర్ధని పత్రిక ఆంధ్ర భాషాసంజీవనికి పోటీ పత్రికగా నుండేది.

🍀1871 లో కందుకూరి వీరేశలింగంగారు కొక్కొండ వెంకటరత్నంగారిని గొప్పగా ప్రశంసిస్తూ వ్రాసిన లేఖ వకటి 1951 జులై నెల భారతి ప్రచురణలో నిడదవోలు వెంకటరావు గారు ప్రచురించారు. కానీ 1874 నుంచీ వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం గారు కొక్కొండవారి సంజీవనిపై విమర్శలు ప్రచురించటము ప్రారంభించారు.

🍀1875 లో వెంకటరత్నంగారు "హాస్యవర్ధని" స్థాపించారు, 1876 లో కందుకూరి వీరేశలింగం గారు "హాస్య సంజీవని" ప్రచురణ ప్రారంభించారు. ఆ విధముగా కొక్కొండ వారికీ, కందుకూరి వారికీ వ్యంగ్య వాదోపవాదాలు కొనసాగుతూ వుండేవి. 1877 లో కొక్కొెండ వెంకటరత్నం గారు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితులుగా నియమింప బడ్డారు. 1890 లో ప్రెసిడెన్సీ కాలేజీలో కొక్కొండ వారు ఆంధ్రభాషా వర్ధని స్థాపించారు. బ్రిటిష్ ప్రభుత్వమువారు కేవలం సంస్కృత పండితులకే ఇచ్చేటటువంటి మహామహోపధ్యాయ బిరుదును అందుకున్న ప్రప్రథము ఆంధ్ర పండితుడు శ్రీ వెంకటరత్నం గారు. 1907 లో ఆ బిరుదు వారికి ఇవ్వబడింది. రాజమండ్రీలో జరిగేటటువంటి ఆంధ్ర సాహిత్యపరిషత్తు సమావేశములకు కొక్కొండ వెంకటరత్నం గారు 1912 ఏప్రిల్23 వతేదీన, 1913 ఏప్రిల్ 22 తేదీన జరిగిన సమావెేశమునకు అధ్యక్షత వహించారు.

🌸ఈయన రచించిన మహాశ్వేత (1867) తెలుగులో తొలి నవలగా కొంతమంది భావిస్తారు. వీరు డిసెంబర్ 14 1915 తేదీన పరమపదించారు.🌸                                                                       

.