Pages

Monday, September 12, 2016

వినాయక చవతి పుఉజ విధానం



వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21రకాల ఆకులని తెలుగులో ఏమంటారో వాటి   ఉపయోగం ఏమిటో  తెలుసుకుందామా ?
ఇది హిందూ ధర్మచక్రం విశిష్ట సమాచారం

1. మాచీ పత్రం: 🌿
ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి
ఈ ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర రోగాలు నయం అవుతాయి. అలాగే చర్మ వ్యాదులకి కూడా అద్భత మందుగా పనిచేస్తుంది. ఆ ఆకుల్ని పసుపు, నువ్వుల నూనెతో కలిపి ముద్దగా నూరి చర్మ వ్యాదులకి రోజూ పూస్తే తొందర్లోనే నయమవుతాయి. అలాగే రక్తపు వాంతులకు, ముక్కునుంచి రక్తం కారడం వంటివి కూడా అరికట్టవచ్చునట. దీనిద్వారా ఆస్తమా నియంత్రించబడుతుంది 🌿
   
2. బృహతీ పత్రం: 🌱
 ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి! బృహతీ పత్రాన్ని వాకుడాకు, నేలమునగాకు అంటారు. దీనిలోనూ ఎన్నో వ్యాధులను తగ్గించగల ఔషదీయ గుణాలున్నాయి, కంఠ రోగాలు, శరీర నొప్పులు, ఎక్కిళ్ళు, కఫ, వాత దోషాలు, అస్తమా, దగ్గు, సైనసైటిస్ తగ్గించడంలో, అరుగుదలకు, గుండె పనితీరు మెరుగుపరిచేందుకు, ఈ చూర్ణం దురదలు, నొప్పి నివారిణిగా, ఈ కషాయంతో నోటి దుర్వాసన, మరియు రక్త శుధ్ధి ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి 🌱
  
 3. బిల్వ పత్రం: 🍁
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి   బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి*.
బిల్వపత్రం అనగా మారేడు. ఈ మారేడు వృక్షాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన పత్రం. ఈ పత్రానికి నిర్మాల్య దోషం లేదు. ఈ పత్రాన్ని ఆ పరమేశ్వరునికి సమర్పించిన రోజే కాక మరున్నాడు కుడా ఉపయోగించవచ్చు. ఆరోగ్యరీత్యా కూడా ఇది ఎంతోఉపయోగపడుతుంది.  మధుమేహం కలవారు రోజు రెండు ఆకులను నెమ్మదిగా నములుతూ ఆ రసాన్ని మింగితే  దివ్యౌషధంగా పనిచేస్తుంది 🍁


4. దూర్వ పత్రం: 🌾
'  ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం '  సమర్పయామి
దూర్వాయుగ్మం అనగా గరిక. అనగా రెండు కొసలు కలిగిఉన్న జంటగరికను దూర్వాయుగ్మం అని అంటారు. గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఈ గరిక అతి ముఖ్యమైనది.ఒక్క గరికెపోచ సమర్పిస్తే మహాదానందపడిపోతాడు మహాగణపతి. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. హిస్టీరియా ఉన్నవారికి దివ్య ఔషధం ఈ గరిక. పైత్యపు తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ గరికను మెత్తగా రుబ్బి నుదిటిమీద లెపనమ్లా వేసుకొంటారు.గరికను పచ్చడిగా చేసుకొని తింటే మూత్రసంబందిత వ్యాధులు తగ్గుతాయి. రక్త, చర్మ సంబంధిత వ్యాధులను, ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది.


 5. దత్తుర పత్రం:
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి   దత్తూర పత్రం ను మనం  ఉమ్మెత్త అని కూడా అంటూ ఉంటాము.. మానసిక వ్యాధిని నివారించాడంలోను, జ్వరాలు, చర్మరోగాలు, అల్సర్లు, చుండ్రు నివారణలోనూ దివ్యౌషధంగా పని చేస్తుంది. కీళ్ళ రోగాలను నయం చేస్తూ నరాలకు గట్టిదనాన్ని ఇస్తుంది

  
6. బదరీ:  🍃
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి
 బదరీపత్రం అనగా రేగు ఆకు. ఈ చెట్టును సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని  స్వరూపంగా భావిస్తారు. సంక్రాంతి సందర్భంలో చిన్నపిల్లలకు పోసే భోగిపళ్ల కార్యక్రమంలో ఈ రేగుపళ్ళు అతి ముఖ్యమైనవి. జుట్టు ఆరోగ్యంగా పెరగటంలో రేగు ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.  🍃
  
7. అపామార్గ పత్రం :  🍀
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి.
అపామార్గ పత్రం అనగా ఉత్తరేణి. దీని ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు నశించి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయానికి, పైల్స్ కు, వంతులకు మంచి ఔషదంగా పనిచేస్తాయి .దీని ఆకులు నూరి రసం గాయాలకు రాస్తే రక్తం కారడాన్ని అరికడుతుంది. యజ్ఞ యాగాలలో ఈ చెట్టు పుల్లలు  వేస్తారు దీని పొగ పీల్చడం వలన శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి..

8. తులసి: 🍃
ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి
విష్ణుమూర్తికి ప్రీతికరమైనది, శ్రీ మహా లక్ష్మీస్వరూపం.తులసి ఆకులు,కొమ్మలు, వేర్లు అన్నింటిలోను ఎన్నో ఔషధ గుణాలున్నాయి. చర్మరోగాలను నయం చేస్తుంది. రోజు తులసిఆకులు నమలడం వలన పంటి చిగుళ్ళకున్న  రోగాలు తగ్గి అరుగుదాలను, ఆకలిని పెంచుతాయి. తులసిరాసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవలన కఫం వలన వచ్చే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.  ఈమధ్య జగిన పరిశోధనలలో రోజుకు 22 గంటలు ప్రాణ వాయువు నిచ్చే చెట్టు తులసిమాత్రమే అని తేలింది.ఇంతగొప్ప లక్షణం మరే ఇతర మొక్కలకు లేదు. ఉత్తప్పుడు ఎప్పుడూ తులసితో గనేశుని పూజించరాదు. పురాణాల ఆధారంగా ఒక్క వినాయక చవితిరోజునే మనం తులసీదళాలతో ఆ స్వామిని పూజించాలి 🍃

9. మామిడి ఆకు: 🌿
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి.
చూతపత్రం అనగా మామిడి ఆకు.దీనిని దేవతా వృక్షం అనికూడా అంటారు.. లేత ఆకులను పెరుగుతో కలిపి మెత్తగా నూరి తింటే అతిసారం తగ్గుతుంది. మామిడి లేత చిగుళ్ళను తింటే చిగుళ్ళ వాపు సమస్య తగ్గుతుంది . మామిడి జిగురులో ఉప్పు వేసి వేడిచేసి కాళ్ళ పగుళ్ళకు, చర్మవ్యాధులకు  పూస్తే తగ్గుముఖం పడతాయి. చెట్టునుంచి కోసిన కొన్ని గంటల వరకు ప్రాణవాయువు ను విడుదలచేస్తాయి 🌿


10. గన్నేరు: 🍂
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి

  కరవీరపత్రం అనగా గన్నేరు. ఏదైనా పువ్వులు కోస్తుంటే అవి క్రింద పడితే పూజకు పనికి రావు కాని గన్నేరు పువ్వులు కోసే సమయంలో క్రింద  పడితే పరవాలేదు వాటిపై నీళ్ళు చల్లి సమర్పించవచ్చు.గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా అది అనేక రోగాలు దూరం  చేస్తుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు గన్నేరుఆకులు కోసి పాలు కారడం తగ్గాక తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. 🍂

11. విష్ణుక్రాంత: 🍀
ఓం భిన్నదంతాయ నమః  విష్ణుక్రాంత పత్రం పూజయామి
 ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది

12. దానిమ్మ:  🍁
 ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి

దానిమ్మ పత్రాన్ని దాడిమీ పత్రం అంటారుదానిమ్మ ఆకు తింటే చర్మం కాంతి వంతమవుతుంది.  దానిమ్మరసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు. కీటకాలు కుట్టడంవలన వచ్చిన దద్దుర్లూఅవి తగ్గుతాయి. దానిమ్మపండు ఆకలిని పెంచి అరుగుదలను ఇస్తుంది.విరోచనాలను తగ్గిస్తుంది.దీని ఆకులకు నూనె రాసి కల్లవాపులు  ఉన్నచోట కడితే తగ్గుతాయి. దానిమ్మ ఆకులు దంచి కషాయం చేసుకుని అందులో పంచదార తగినంత వేసి తాగితే దగ్గు, నీరసం,ఉబ్బసం,అజీర్తి వంటి రోగాలనుంది ఉపసమనం లభిస్తుంది.



13. దేవదారు: 
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
  దేవతలకు  అత్యంత ఇష్టమైన పత్రం దేవదారు.. పార్వతీ దేవికి అత్యంత ఇష్టమైనది. దీని మానుతో చెక్కే విగ్రహాలకు సహజత్వం వుంటుంది.ఆరోగ్యరీత్యా చూస్తే... ఇది అజీర్తి, చర్మసంబంధ వ్యాధులు తగ్గిస్తుంది.ఈ చెట్టు ఆకులను ఆరబెట్టి, ఆరిన ఆకులను కొబ్బరి నూనెలో వేసి కాచి చల్లార్చి ఆ నూనెను తలకి రాసుకుంటే మెదడు చల్లబడి కంటి సంబంధ రోగాలు దరిచేరవు. ఈ చెట్టు మానునుంచి తీసిన నూనె చుక్కలు వేడినీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి

14. మరువక పత్రం: 🌾
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి
మరువక పత్రం అనగా మరువము. దీనిని మనం ధవనము అని పిలుస్తుంటాము    ఇది మంచి సువాసన కలిగి వుంటుంది. మనం నిత్యం దీనిని పువ్వుల దండలలో వాడటం చూస్తాము.శరీరం దుర్వాసన వస్తుంటే వేడినీళ్ళలో మరువం వేసుకుని స్నానం చేస్తే ఆ దుర్వాసన తొలగిపోతుంది. 🌾

 15. సింధువార పత్రం: 🍁
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
సింధువార పత్రం అనగా వావిలి ఆకు. వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు. దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు మరియు గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.పత్రాలు కషాయం కాచి, మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు, తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది. పత్రాల రసంలో అల్లరసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది*.
వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు. 🍁

16. జాజి పత్రం: 🌿
ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
ఇది జాజి అనే  మల్లిజాతి మొక్క. ఇది అన్ని చోట్లా దొరుకుతాయి. ఇందులో
సన్నజాజి, విరజాజి రెండు రకాలు కలవు. వీటి పువ్వుల నుంచి సుగంధతైలం తీస్తారు.జాజి చర్మరోగాలనివారణకుమంచిదివ్యఔషదం.జాజిమొగ్గలతోనేత్రవ్యాదులునయంచేస్తారు. జాజి కషాయాన్ని
రోజు తీసుకోవడంవలన క్యాన్సర్ నివారణ అవుతుందని చెపుతున్నారు. 🌿

 17. గండకీ పత్రం:
ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి
గండకీపత్రం అనగా దేవకాంచనం. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ వ్యాధికి చక్కని ఔషధం ఈ గండకీ  పత్రం. దీని ఆకులు మొండి,దీర్ఘవ్యధులకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. దగ్గు, జలుబులను తగ్గిస్తుంది.
  
18. శమీ పత్రం  : 🍂
ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి
శమీపత్రం అనగా జమ్మి ఆకు. తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా లకు మందుగా పనిచేస్తుంది  🍃

 19. : అశ్వత్థ పత్రం  🍀
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
అశ్వత్థ పత్రం  అనగా రావిఆకు.  రావి  సాక్షాత్  శ్రీమహావిష్ణువు స్వరూపం. తులసిలేని ఇల్లు వేపలేని వీధి,రావిచెట్టులేని ఊరు ఉండదన్నది మన పెద్దల మాట. రావి ఆకులు హృదయసంబంధమైన రోగాలకు ఉపయోగిస్తారు.ఎండిన రావిపుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి దానిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాస సంబంధవ్యాదులు నివారణ అవుతాయి.జీర్ణశక్తిని జ్ఞాపకశక్తిని పెపోదించే గుణం గల ఆకులు రావిఆకులు. 🍀

 20. అర్జున పత్రం:
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
అర్జున పత్రం అనగా తెల్లమద్ది.మద్ది చెట్టు హృదయసంబంధిత  రోగాలకు దివ్య ఔషదం.ఇది శరీరానికి చలువ చేస్తుంది. రక్తనాళాలను గట్టి పరుస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. ఈ అర్జునపత్ర బెరడు రుబ్బి ఎముకలు విరిగినచోట పెడితే తొందరగా నయం అవుతుంది. కీళ్ళనొప్పులు, మలాశయ దోషాల నివారణలో బాగా ఉపయోగపడుతుంది.🍀
.
21. అర్కపత్రం: 🌿
ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి.
ఆర్కపత్రం అనగా జిల్లేడు. ఈ చెట్టు  గణపతి స్వరూపం.రథసప్తమి రోజు జిల్లేడు పత్రాలు ధరించి నదీస్నానము చేస్తే చాలా పుణ్యమని హిందువుల నమ్మకం. పాలను పసుపుతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖవర్చస్సు పెంపొందుతుంది.లేత జిల్లేడు చిగుళ్ళను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రలుగా చేసి ఆ నాలుగు రోజులు ఉదయం ఒకటి, సాయంత్ర ఒకటి చొప్పున సేవిస్తే స్ర్తీల బహిష్టు నొప్పులు తగ్గుతాయి.చర్మ సమస్యలను తగ్గిస్తుంది. శరీర సమస్యలకు ఉపయోగపదుతుంది. కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది. జిల్లెడుతో చేసిన నునె చేవుడుకు ఔషధం గా ఉపయోగపడుతుంది.ఇది రక్త శుద్ధిని చేస్తుంది. 🌿

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ

No comments:

Post a Comment

.